బ్రేకింగ్‌.. ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు

ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయ్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్‌ ఆధారిత అన్ని రెగ్యులర్‌ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు, సబర్బన్‌ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో లాక్‌డౌన్‌ విధించిన కారణంగా అన్ని రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసులను రైల్వే శాఖ మార్చిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దు నిర్ణయాన్ని జూన్‌ 30 వరకు పొడిగించిన విషయంతెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నవేళ మరోసారి రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయంతీసుకుంది. దేశంలో లాక్‌డౌన్‌ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *