ఏపీలో రూ.4వేల కోట్లు పెట్టుబడులు సిద్ధమైన Apollo Tyres

అపోలో హాస్పిటల్స్ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైయ్యారు. ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉన్న టైర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇండియాలో ఐదో స్థానంలో ఉంది. అటువంటి అపోలో టైర్స్ మొదటి దశలో భాగంగా రూ.3వేల 800కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.

చిత్తూరు జిల్లాలోని చిన్నపండూరు గ్రామంలో 256 ఎకరాల్లో దీనిని ప్రారంభించనున్నారు. మరో 12-18నెలల్లో కెపాసిటీని క్రమంగా పెంచుతారు. 2022 నాటికి రోజుకు 15వేల ప్యాసింజర్ కారు టైర్లను, 3వేల ట్రక్ బస్ రేడియల్స్ ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కమిషనింగ్ ఫెసిలిటీపై అపోలో టైర్స్ లిమిటెడ్ చైర్మన్ ఓంకార్ ఎస్ కాన్వార్ ఇలా స్పందించారు.

మా ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యం అనేవి అల్ట్రా మోడరన్ ఫెసిలిటీతో కూడుకున్నవి. టైర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ లో అత్యుత్తమ టెక్నిక్ లు వాడి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాం. ఐటీ డ్రైవెన్ సిస్టమ్స్, రోబోటిక్స్ టెక్నిక్స్ తో పాటు యువకులు, నైపుణ్యం వారికి ఉద్యోగాలు కల్పిస్తాం. షాప్ ఫ్లోర్ ను స్థానికంగానే అద్దెకు తీసుకుంటాం. భారత్ స్వతహాగా నిలబడగలదనే దానికి ఇది అద్ధం పడుతుంది.

మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ ప్లాంట్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీలో 850మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *