చిత్తూరు జిల్లా వార్తల సమహారం 26-06 -2020

చిత్తూరు : మరో 62 పాజిటివ్ కేసులు నమోదు..పూర్తి వివరాలివే
చిత్తూరు జిల్లాలోని కరోనా కేసులు రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధికారులు మీడియా బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలోని మండలాల వారీగా..శ్రీకాళహస్తి 20 ,విజయపురం 10,తిరుపతి అర్బన్ 9, పుత్తూరు 7,తిరుపతి రూరల్ 6,నగిరి 3,ఆధర్ 2,పిచ్చాటూరు 2,పలమనేరు 1,పెద్దపంజాణి 1,సత్యవేడు 1 మొత్తం 62 కరోనా కేసులు నమోదైనట్లు అధికారికంగా వెల్లడించారు.

ఎస్వీబీసీకి తొలి విరాళం రూ.10 లక్షలు
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు స్వచ్ఛందంగా ఓ భక్తుడు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ, ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.వి.ధర్మారెడ్డికి తన బంగ్లాలో మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సోమయాజుల లక్మణమూర్తి చెక్కును అందజేశారు. వారితో పాటు ఛానెల్ సీఈఓ వై. వెంకటనగేష్ ఉన్నారు.

ఎస్వీబీసీ ఛానెల్ పై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం కంటే భక్తులు మనోభావాలు ముఖ్యమని, అందులో భాగంగానే ఇక నుంచి ఎస్వీబీసీ ఛానెల్‌ను యాడ్ ఫ్రీ ఛానెల్‌గా ప్రసారం కానున్నట్టు టీటీడీ యాజమాన్యం తెలిపింది.

లాక్ డౌన్ పై తప్పుడు ప్రచారం..కమిషనర్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం కోవిడ్ కేసులు 10వేలు దాటగా.. నిత్యం భారీగా సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు నగరాలు, జిల్లాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఐతే తిరుపతిలోనూ లాక్‌డౌన్ విధించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుపతి నగర పాలక సంస్థ క్లారిటీ ఇచ్చింది. తిరుపతిలో ఎలాంటి లాక్‌డౌన్ విధించడం లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష స్పష్టం చేశారు.

276 మందికి పింఛన్లు పంపిణీ : ఎంపీడీఓ
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో 276 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీఓ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పంపీణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు పింఛను పుస్తకాలు అందజేశారు.

మాస్కులు లేని వారికి జరిమానా
చిత్తూరు జిల్లా పలమనేరులో శుక్రవారం నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు లేనివారికి 135 రూపాయలు జరిమానా వేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ మున్వర్, వేలాయుధం, లక్ష్మణ్ పాల్గొన్నారు.

70 ఏళ్ల వృద్దునికి కరోనా పాజిటీవ్
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని కిట్టన్న మిషన్ వీధిలో 70 ఏళ్ల వృద్దుడికి కరనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఎస్సై నాగరాజు శుక్రవారం తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం రెడ్ జోన్ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *