యువతా… మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు , తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…

యువతా… మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు , తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…
అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ ఐ.పి.యస్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నందు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు, పద్మావతి ఉమెన్స్ కాలేజి మరియు సీకాం కాలేజి ప్రిన్సిపాల్స్, విద్యార్థిని విద్యార్థులతో కలసి పాల్గొన్నారు.
విచ్చలవిడి తనానికి అలవాడు పడి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్క దిద్దికోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తెలియచేసారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఏ.ఆర్ స్థానిక పోలీస్ గ్రౌండ్ నందు పత్రికా ముఖంగా అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేఖ దినోత్సవం గురించి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ మత్తు వదలకపోతే బ్రతుకులు చిత్తైపోతాయని ఉద్బోధించారు . మొదట్లో తమాషాగా తీసుకునే ఈ మత్తపదార్థాలు ఆ తరువాత వారే దానికి బానిసలుగా మారిపోతుంటారని అన్నారు. అది నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని కోట్లు గడిద్దామని ఎవరైనా భ్రమ పడి అమాయక యువకులు, విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విక్రయ మూఠాలపైన, వినియోగించేవారిపైన గట్టి నిఘా ఏర్పాటు చేసామని ఎవరైనా, ఎంతటి వారైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొద్దిరోజుల క్రితమే తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ గంజాయి సరఫరా, దాని చైన్ లింకును ఛేదించే పనిలో ఉన్నామని చెప్పారు. తిరుపతిలో దుకాణదారులకు కూడా ఓ హెచ్చరిక చేశారు. పిల్లలను, యువకులను టార్గెట్ గా చేసుకుని వారిచ్చే కమీషన్ల కోసం ఇలాంటి మత్తు పదార్థాలు విక్రయిద్దామని చూస్తే కటకటాలు తప్పదని హెచ్చరించారు. కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలని, అవారాగా తిరుగుతున్న వారి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు. వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తనలో ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. లేకుంటే మీ కుటుంబాలు ఛిద్రమౌతాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించారు.
తిరుపతిలో వచ్చే సోమవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారి భరతం పడతామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఉమ్మివేయడాలు నేరమని తెలిసినా ఎవరూ పాటించలేదని అన్నారు. అలాంటి వారిని సక్రమైన పద్దతిలో పెట్టడానికి పోలీస్ ప్రయత్నం చేస్తుందన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో ధుమపానం చేస్తున్నా ఫోటోకాని, వీడియో కానీ 8099999977 నెంబర్ కు పంపితే వారికి జరిమానతో పాటు తగిన బుద్దిచెబుతామని ప్రజలను కోరారు. 18 యేళ్ళ వయసులోబడిన వారికి ధూమపానం విక్రయించే దుకాణదారులపై కూడా జరిమానా తప్పదని హెచ్చరించారు.
అలాగే రాత్రిళ్ళలో గుంపులు గుంపులుగా రోడ్లపై కూర్చొని బర్త్ డే పార్టీలని అవనీ ఇవనీ చేస్తుంటే కుదరదని హెచ్చరించారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు ప్రజలకు ఆటంకాలు కలిగించినా, రాత్రి 9 గంటలు దాటాక రోడ్డు ఖాళీగా ఉందని కహానీ పెట్టినా అలాంటి వారు పోలీసుస్టేషన్లో బర్త్ డే పార్టీలు చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు‌. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఈ సందర్బంగా జిల్లా యస్.పి గారు తెలిపారు.
ఈ సందర్భంగా అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు, యస్.బి డి.యస్.పి గంగయ్య గారు, పద్మావతి ఉమెన్స్ కాలేజి మరియు సీకాం కాలేజి ప్రిన్సిపాల్స్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. #AntiDrugDay #APPOLICE #TirupatiPolice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *