తిరుపతి లో రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్న వై.ఎస్ర్.ఆర్ సీపీ . 32 వ వార్డ్ అభ్యర్థి సి. శైలజ , పార్టీ నాయకులు ,మరియు వార్డ్ వాలంటీర్లు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1000 పంపిణీ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంతో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది.
కాగా కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా కర్ఫ్యూ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 1000 రూపాయల పంపిణీ కార్యక్రమంలో *32 వ వార్డు YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *C శైలజ* మరియు చేలికం కుసుమ, తిరుత్తని వేణుగోపాల్, పునీత ,ఉష మొదలైనవారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *