భాద్యత కలిగిన రాజకీయ నేతలుగా తాము ప్రజలకు అండగా ఉంటాము:-వై.సి.పీ నేత :-తిరుత్తని వేణుగోపాల్

కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారని చిత్తూర్ జిల్లా వైయస్సార్ సీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ వెల్లడించారు
ఈ రోజు ఆయన ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా తో మాట్లాడుతూ : కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో వీధి, వీధి తిరిగి నిత్య శ్రామికులు లాగా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు సూచిస్తుంటే అన్నప్రసాద పంపిణీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహాయకులు గా తోడ్పడి తిరుపతి లో గల నిరుపేదలకు, వీధి సంచార కులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులకు, హాస్పిటల్ నందు గల రోగుల సహాయకులకు టి.టి.డి అన్నప్రసాద పేరుమీద పంపిణీ చేస్తుంటే టిడిపి నాయకులు విమర్శించడం చాలా బాధాకరం అని ఆయన చెప్పారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని రాజకీయ కోణంలో మాట్లాడుతుంటే ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో కూర్చొని అదే బాటలో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని ఆయన చెప్పారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడటం బాధాకరం గా ఉంది అని ఆయన వెల్లడించారు.

సీఎం జగన్‌కు, తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. బాధ్యత కలిగిన రాజకీయ నేతలుగా తాము ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన తిరుపతి M L A భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో అన్ని శాఖల సమన్వయంతో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు.

సీఎం జగన్‌కు, తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. బాధ్యత కలిగిన రాజకీయ నేతలుగా తాము ప్రజలకు అండగా ఉంటామని
అన్ని రంగాలవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *